9 March 2022

EPS 95దేశ వ్యాప్త సభ్యులకు 7500+DA వెంటనే మంజూరు చేయుట NAC

 EPS 95దేశ వ్యాప్త సభ్యులకు  7500+DA వెంటనే మంజూరు చేయుట NAC

ఈ రోజు (7/3/21) ఉదయం గంll 11:00 లకు మన NAC జాతీయ నాయకులు మాననీయ గౌరవ కాప్టెన్ శ్రీ అశోక్ రావత్ గారు EPS 95దేశ వ్యాప్త సభ్యులకు ఇచ్చిన పిలుపు మేరకు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని PF కార్యాలయం నందు  కమిషనర్ గారికి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, CBT సభ్యులకు చేరవేయుటకు మరియు సత్వర పరిష్కార సుగమానికి తగు విధంగా ఒత్తిడి చేయుటకు మన ఈ కిందతెలిపిన జీవన్మరణ సమస్యలు మరొక్కమారు ఏకరువు పెడుతూ సమర్పించ నైనది.


మన సమస్యల 4పాయింట్ ఫార్ముల. మనకు కావలసిన సంజీవిని.
1. కనీస నెలవారీ పెన్షన్ 7500+DA వెంటనే మంజూరు చేయుట.
2. రిటైర్ ఉద్యోగికి మరియు అతని /ఆమె జీవిత భాగస్వామి కి ఉచిత వైద్య సదుపాయకల్పించి శేష జీవితాన్ని ఆరోగ్యమయం చేయుట.
3.విశ్రాంత ఉద్యోగి నిర్యాణం చెందితే వారి జీవిత భాగస్వామి కి పూర్తి (100%) పెన్షన్ వర్తింపజేయుట.
4. Eps 95 వర్తింపని  రిటైర్ సభ్యులకు కనీసం 5000/- నెలవారీ పెన్షన్ కల్పించుతూ వారిని ఆదుకొనుట.
పైన తెలిపిన మెమోరాండం సమర్పించడానికి ముందుగా వివిధ శాఖల నుండి pf ఆఫీస్ ముందుకు వచ్చిన సభ్యులనుద్దేశించి
మన జాతీయ NAC ఆదేశాలు మరియు కార్యక్రమ ఆచరణ ప్రగతి గురించి శ్రీ A. మాధవరావు , శ్రీ B. నారాయణ మొదలగు వారు
తెలియజేసినారు.
మనల్నిNAC తప్పక గమ్యం చేర్చుతుంది.
జై NAC!
జై అశోక్ రావత్!!


0 comments:

Post a Comment

 
close